![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -462 లో... జ్యోత్స్న చేతిలో తాళి పెట్టి వెళ్తుంది దీప. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి.. నా భార్య ఏదో ఇస్తాను అంది ఇచ్చిందా? ఇచ్చే ఉంటుందిలే అని కార్తీక్ వెటకారంగా మాట్లాడుతుంటాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వస్తుంది. నువ్వు ఏదో దాస్తున్నావ్ బావ అని జ్యోత్స్న అడుగుతుంది. ఏం దాస్తున్నానని కార్తీక్ మళ్ళీ వెటకారంగా మాట్లాడతాడు.
ఆ తర్వాత నువ్వు ఇందంతా కావాలనే చేస్తున్నావ్.. అందరిని నాకు యాంటి చేస్తున్నావ్.. ఒక మమ్మీ మాత్రమే నాకు సపోర్ట్ గా ఉంది. ఇప్పుడు తనని కుడా మీ వైపుకి మార్చుకోవాలని చూస్తున్నావ్.. ఇప్పుడు ఆ పాపని తీసుకొని వచ్చి మరింత దగ్గర అయ్యి.. సీఈఓ అవ్వాలని అనుకుంటున్నావని జ్యోత్స్న అనగానే జోక్ బాగుందని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత శ్రీధర్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టానని స్వప్న ఏడుస్తుంటే.. కావేరి ఓదారుస్తుంది. అప్పుడే స్వప్నని శ్రీధర్ పిలిచి బయటకు వెళదామని అంటాడు. బయటకు వెళ్తుంటే బైక్ స్టార్ట్ అవ్వదు.. శ్రీధర్ చూసి కావేరిని పిలిచి బైక్ రిపేర్ అనుకుంటా.. ఇదిగో డబ్బు అల్లుడికి ఇచ్చి బైక్ రిపేర్ చేయించమను ఖర్చులకి ఉంచుకోమను అని చెప్పి కావేరికి డబ్బు ఇస్తాడు శ్రీధర్. దాంతో డబ్బు తీసుకొని వెళ్లి స్వప్నకి ఇస్తుంది. తర్వాత అది స్వప్న తీసుకొని కాశీకి ఇస్తుంది.
మరొకవైపు శౌర్య దగ్గర నుండి పారిజాతం చాక్లెట్ బాక్స్ దొంగతనం చేస్తుంది. ఆ విషయం శివన్నారాయణకి తెలిసి పారిజాతంపై కోప్పడతాడు. కార్తీక్ బెత్తం తీసుకొని వస్తాడు. అది చూసి పారిజాతం భయపడుతుంది. ఎవరైనా చిన్నపిల్లల నుండి చాక్లెట్ దొంగతనం చేస్తారా అని కార్తీక్ అనగానే.. నోరు అంత చేదుగా ఉంది అందుకేనని పారిజాతం అంటుంది. ఆ తర్వాత శ్రీధర్ లో సడన్ గా ఇంత మార్పు ఏంటి దీనికి అన్నయ్యనే కారణమై ఉంటుందని కావేరితో స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |